Monday, December 23, 2024

అశ్విన్-తనీషా జోడీకి టైటిల్

- Advertisement -
- Advertisement -

గువాహటి : భారత్ బాడ్మింటన్ జోడీ అశ్విని పొన్నప్పతనీషా క్రాస్టోలు గువాహటి మాస్టర్స్ సూపర్ 100 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ప్రపంచ రెండో సీడెడ్ అయిన ఈ జోడీ ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో 2113 2119 తేడాతో చైనీస్ తైపీకి చెందిన సుగ్ షో యున్ యు చీన్ హుయీ జోడీపై గెలుపొందారు. అద్యాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ మెరుగైన ఆటతీరుతో చైనీస్ జోడీని మట్టికరిపించింది. కాగా, భారత జోడీకి ఇది మూడో మేజర్ టైటిల్. ఈ ఏడాది అబుదాబి మాస్టర్స్‌తో పాటు నెంట్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ నెగ్గిన పొన్నప్పతనీషాలు ఇటీవలే ముగిసిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో రెండో స్థాన్ నిలిచింది. ఈ జోడీకి సూపర్ 100 కేటగిరీలో అబుదాబి మాస్టర్స్ తర్వాత ఇది రెండో టైటిల్ కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News