Monday, January 20, 2025

పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమా చూడలేనన్న ఆయన భార్య అశ్విని

- Advertisement -
- Advertisement -

Ashwini on James movie
బెంగళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన జయంతి సందర్భంగానే ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా చూసేందుకు జనాలు ఉదయం 6.00 గంటల నుంచే థియేటర్ల ముందు బారులు తీరారు. విశేషమేమిటంటే మార్చి 25 వరకు కర్ణాటక అన్ని థియేటర్లలో ‘జేమ్స్’ సినిమాను మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇదిలావుండగా ఆ సినిమాపై ఆయన భార్య అశ్విని ఓ ఇంటర్వూలో “నేను జేమ్స్ సినిమా చూడలేను. ఎందుకంటే అందరిలా ఆ సినిమాను చూడలేకపోవచ్చు. సినిమా బాగా రూపుదిద్దుకుందని చిత్ర బృందం, ప్రేక్షకులు అంటున్నారు. కానీ నేను భావోద్వేగాలతో ఆ సినిమా చూడలేను, కాబట్టి వెళ్లలేదు. జేమ్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా వివరించారు’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించారు. “మా సంస్థ పిఆర్‌కె(పునీత్ రాజ్‌కుమార్ ప్రొడక్షన్) ద్వారా కొత్త వారికి అవకాశాలు కల్పిస్తాం. మా బ్యానర్ నుంచి ప్రతి సినిమా విజయం సాధించకపోయినా, మంచి సినిమాలే తీస్తాం. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు రక్తదానం, నేత్రదానం, అన్నదానం వంటి అనేక కార్యక్రయాలు చేపట్టారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇదిలావుండగా పునీత్ రాజ్‌కుమార్ చివరి సినిమాను ఆయన సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఆయన కుమార్తె వందిత, వినయ్ రాజ్ కుమార్, యువ రాజ్‌కుమార్ తదితర మిగతా కుటుంబ సభ్యులు చూశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News