Friday, November 22, 2024

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హోంగార్డ్ నుంచి లంచం తీసుకుంటూ ఎసిబికి ఎఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్ చిక్కారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే హోంగార్డ్ యనమల రాము కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్ రాము పేరు ఓ కేసులో నిందితుడిగా  నమోదైంది. అయితే ఈ కేసులో అతని పేరును తొలగించి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పించడానికి హోంగార్డు నుంచి 5,000/- రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా సరూర్ నగర్ మహిళా పోలీసు స్టేషన్ ఎఎస్‌ఐ సరళా, హెడ్ కానిస్టేబుల్ నరసింహ డిమాండ్ చేశారు.

వీరిద్దరూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా లంచం అడిగి వేధింపులకు గురిచేస్తున్నారని ఎసిబి అధికారులకు హోంగార్డ్ రాము తెలిపారు. ఎఎస్‌ఐ, హెచ్‌సిలు 5,000/- రూపాయలు హోంగార్డ్ నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న వీరిద్దరిపై కేసు నమోదు చేసుకుని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఏ ప్రభుత్వ శాఖ ఉద్యోగి అయిన తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసి , లంచం డిమాండ్ చేస్తే ఎసిబి కేటాయించిన టోల్ ఫ్రీ ఫోన్ నంబర్-1064 (టోల్ ఫ్రీ నంబర్)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎసిబి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News