Friday, April 4, 2025

అక్రమ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడిన ఎఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -

అమరావతి: దొంగలకు బుద్ది చెప్పాల్సిన పోలీసే వక్రబుద్ధి చూపించాడు. తెలంగాణ నుంచి మద్యం బాటిళ్లను తరలిస్తూ ఎఎస్‌ఐ పట్టుబడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో దాచేపల్లిలో జరిగింది. గురుజాల పోలీస్ స్టేషన్‌లో స్టాలిన్ అనే కానిస్టేబుల్ ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో మద్యం రేటు ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి ఎపికి అక్రమ మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు. మద్యం బాటిళ్లను గుంటూరుకు తరలిస్తుండగా పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఎఎస్‌ఐతో పాటు మరో ఇద్దరిని పోలీసులు పట్టకున్నారు. నిందితుల వద్ద నుంచి 42 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News