Thursday, January 23, 2025

పికెటింగ్‌కు వచ్చాడు… మద్యం తాగి చిందేసిన ఎఎస్‌ఐ… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ గ్రామానికి విధులకు వెళ్లిన ఎఎస్‌ఐ మద్యంతాగి చిందేయడంతో అతడిపై పోలీస్ వేటు వేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. శంకరాపురంలో రెండు గ్రూపులు కొట్టుకోవడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఓ వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఆ గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలో ఎఎస్‌ఐ వెంకటేశ్వర్లకు డ్యూటీ వేయడంతో అక్కడికి వెళ్లాడు. మద్యం ప్రియులతో కలిసి సదరు ఎఎస్‌ఐ మద్యం తాగి చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరడంతో సదరు ఎఎస్‌ఐని వేకేన్సీ రిజర్వ్‌కు పంపారు. తదపరి చర్యలు తీసుకుంటామని ఉన్నాతాధికారులు తెలిపారు.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News