Monday, December 23, 2024

జ్ఞానవాపి మసీదులో ఎఎస్‌ఐ సర్వేకు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

వారణాసి : జ్ఞానవాపి మసీదు ఆవరణలో పురావస్తుశాఖ చేపట్టిన శాస్త్రీయ సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించడానికి మరో నాలుగు వారాలు గడువు పొడిగిస్తూ వారణాసి కోర్టు మంజూరు చేసింది. ఆపై గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సర్వేను పూర్తి చేయడానికి మరో నాలుగు వారాలు గడువు పొడిగిస్తూ జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ అంగీకరించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది రాజేష్ మిశ్రా తెలియజేశారు. గడువు పొడిగించాలని భారత పురావస్తు శాఖ అభ్యర్ధనపై గురువారం విచారణ సాగింది. ఈనెల ఆరో తేదీ నాటికి పురావస్తుశాఖ తన సర్వేను పూర్తి చేసి నివేదిక సమర్పించ వలసి ఉంది. అయితే ఇప్పుడు గడువు పొడిగించడంతో నవంబర్ 6 నాటికి సర్వే పూర్తి చేసి నివేదిక సమర్పించవలసి ఉంటుంది. హిందూ ఆలయంపై ఈ మసీదు నిర్మాణమైందన్న వివాదంపై నిజనిర్ధారణ కోసం ఈ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News