Wednesday, January 22, 2025

జ్ఞానవాపి సర్వే నాలుగో రోజు ఆలస్యంగా ప్రారంభం

- Advertisement -
- Advertisement -

వారణాసి : జ్ఞానవాపి సర్వే నాలుగోరోజు సోమవారం కూడా కొనసాగినా మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. పక్కనున్న కాశీ విశ్వనాధ ఆలయంలో జనం రద్దీగా ఉండడమే దీనికి కారణం . ఆదివారం జ్ఞానవాపి కాంప్లెక్సు లోని మూడు గుమ్మటాలు, బేస్‌మెంట్స్ సర్వే చేయడమైందని ప్రభుత్వ న్యాయవాది రాజేష్ మిశ్రా చెప్పారు. మ్యాపింగ్, మెజరింగ్, ఫోటోగ్రఫీ ఆదివారం జరిగాయని, అవి కొనసాగుతాయని చెప్పారు. మొత్తం మీద సర్వేకు చాలా సమయం పడుతుందన్నారు. సర్వేలో హిందూ దేవుడి విగ్రహం, త్రిశూలం కనిపించాయని ఆదివారం వదంతులు వ్యాపించాయని, అలాంటి వాటిని ఆపించాలని ముస్లిం వర్గాలు సర్వే అధికారులను కోరాయి. అలాంటి వదంతులు జనంలో ఆందోళన రేకెత్తిస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News