Monday, December 23, 2024

ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీలో సింధుకు కాంస్యం..

- Advertisement -
- Advertisement -

మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో తెలుగుతేజం సింధు జపాన్ స్టార్ అకానె యమగూచి చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా సింధుకు కాంస్య పతకం ఖాయమైంది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో సింధు 2113, 1921, 1621 తేడాతో యమగూచి చేతిలో ఓటమి పాలైంది. ఆరంభ సెట్‌లో సింధు ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచ నంబర్2 ర్యాంక్ షట్లర్ యమగూచిని హడలెత్తిస్తూ ముందుకు సాగింది. దూకుడైన ఆటతో అలవోకగా సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా సింధు బాగానే ఆడింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన అకానె సెట్‌ను దక్కించుకుంది. ఇక ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో సింధు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన యమగూచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

Asia Badminton Championships: PV Sindhu confirms Silver

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News