Wednesday, January 22, 2025

హాంకాంగ్ 38 ఆలౌట్.. పాకిస్థాన్ రికార్డు విజయం

- Advertisement -
- Advertisement -

షార్జా: ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్ 38 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 155 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్ సూపర్4కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ రిజ్వాన్ (78), ఫకర్ జమాన్ (53) మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. మరోవైపు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఖుష్‌దిల్ షా15 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్ 10.4 ఓవర్లలో 38 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది.జట్టులో ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోరును అందుకోలేక పోయారు. పాక్ బౌలర్లలో షాదాబ్ నాలుగు, నవాజ్ మూడు, నసీమ్ రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బౌలర్లు సమష్టిగా రాణించి హాంకాంగ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు.

Asia Cup 2022: PAK won by 155 runs against HK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News