- Advertisement -
షార్జా: లీగ్ దశలో అఫ్గానిస్థాన్ చేతిలో ఎదురైన పరాజయానికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన సూపర్4 మ్యాచ్‌లో లంక నాలుగు వికెట్ల తేడాతో అఫ్గాన్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఓపెనర్ గుర్బాజ్ ఆరు సిక్సర్లు, 4 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక 19.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు నిసాంకా (35), కుశాల్ మెండిస్ (36), ధనుష్కా గుణతిలక (33) లంక విజయంలో కీలక పాత్ర పోషించారు.
Asia Cup 2022: SL Won by 4 wickets against AFG
- Advertisement -