Sunday, November 24, 2024

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

పల్లెకెలె: ఆసియాకప్‌లో భాగంగా గురువారం జరిగే గ్రూప్‌బి తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడనుంది. పల్లెకెలె వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కీలక ఆటగాళ్లు అనారోగ్యం బారిన పడడంతో ఆతిథ్య శ్రీలంక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇక బంగ్లాదేశ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. లంకతో పోల్చితే బంగ్లాదేశ్ కాస్త బలంగా కనిపిస్తోంది. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం లంకకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

విజయమే లక్షంగా..
ఆతిథ్య శ్రీలంక ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక నిలకడైన విజయాలు సాధిస్తోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో లంక అసాధారణ ఆటతో అలరించింది. ఇదే జోరును ఆసియాకప్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలి ంగ్ విభాగాల్లో లంక సమతూకంగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా, దిముత్ కరుణరత్నె జోరుమీదున్నారు. ఆసియాకప్‌లోనూ వీరు జట్టుకు కీలకంగా మారారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్నా లంకకు శుభారంభం ఖాయం. కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ డిసిల్వా, కెప్టెన్ దాసున్ శనకలతో లంక బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక తీక్షణ, పతిరణ, ప్రమోద్ మదుషన్, శనక, రజిత తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. దీంతో లంకకు ఈ మ్యాచ్‌లో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు బంగ్లాను కూడా తక్కువ అంచనా వేయ లేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ జట్టుకు కీలకంగా మారాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. తంజీద్ హసన్, మహ్మద్ నయీం, ముష్ఫికుర్ రహీం, నజ్ముల్ హుస్సేన్ షాంటానో, మెహదీ హసన్ మీరాజ్, తస్కిన్ అహ్మద్, షరిఫుల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రహ్మన్ తదితరులతో బంగ్లాదేశ్ చాలా బలంగా ఉంది. ఆఫిఫ్ హుస్సేన్, అనముల్ హక్, హసన్ మహమూద్‌లను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న బంగ్లాదేశ్ కూడా భారీ ఆశలతో ఆసియాకప్‌నకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సూపర్4 అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News