Thursday, January 23, 2025

ఆసియా కప్: భారత్ 147/2.. మ్యాచ్ రేపటికి వాయిదా

- Advertisement -
- Advertisement -

కొలొంబో: ఆసియా కప్‌ 2023 సూపర్-4లో భాగంగా కీలక పోరులో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వాయిదా పడింది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. ఈ మ్యాచ్‌లో 24.1 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. కొద్దిసేపు తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నించినా.. మళ్లి వాన దంచికొట్టడంతో మ్యాచ్ ను రిజర్వ్ డేగా ప్రకటించిన రేపటికి అంపైర్లు వాయిదా వేశారు.

అంంతకుముందు భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ హాఫ్ చెలరేగి ఆడి తొలి వికెట్ కు 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(8), కెఎల్ రాహుల్(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News