Friday, November 22, 2024

భారత్-పాక్ మ్యాచ్ రిజర్వ్

- Advertisement -
- Advertisement -

కొలొంబో: భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవానికి వాయిదా పడింది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే నాడు నిర్వహించనున్నారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడి వరకు జరిగిందో అక్కడి నుంచే సోమవారం తిరిగి ప్రారంభం కానుంది. అంటే 50 ఓవర్ల పూర్తి మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. కాగా నేడు వర్షం అంతరాయం కల్గించే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 147 పరుగులు చేసింది. సాధారణ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకే మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు కూడా మంచి ఫిట్నెస్‌తో గ్రౌండ్‌లోకి అడుగు పెట్టారు అయితే రోహిత్ శర్మ మొదట స్ట్రైక్ లోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ పేస్ బౌలర్ అయిన షాహిన్ అఫ్రిది మొదటి ఓవర్ వేశాడు అయితే మొదట షాహిన్ అఫ్రిది బాల్స్ చాలా వేగంగా దూసుకు రావడంతో రోహిత్ మొదటి ఐదు బంతులని చాలా ఓపిగ్గా డిపెండ్ చేస్తూ ఆడుతూ వచ్చాడు కానీ చివరి బంతికి బంతికి సిక్స్ కొట్టాడు.

అయితే రోహిత్ శర్మ, గిల్ ఇద్దరు కూడా ముందే పవర్ ప్లేలో వికెట్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయిపోయి ఆడినట్టు గా తెలుస్తుంది అందులో భాగంగానే ఇద్దరు కూడా చాలా నిధానంగా వికెట్ కాపాడుతూ మరి స్కోర్ ని చేస్తూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లారు అయితే 49 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్ లు కొట్టి 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ శాదబ్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అవడం జరిగింది.ఆయన ఔట్ అయినప్పుడు ఇండియా స్కోర్ 16 ఓవర్ నాలుగు బంతులకి 121గా ఉంది. ఇక ఓపెనర్లు ఇద్దరు కలిసి టీమిండియాకి మంచి భాగస్వామ్యం అందించారు. ఇక అచితూచీ అడుతూ ఇరువురు ఓపెనర్లు రోహిత్ శర్మ(56), శుభ్‌మన్ గిల్(58) అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని, స్కోర్ బోర్డును పరుగు పెట్టించారు. సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు.

రోహిత్ అరుదైన రికార్డు..
ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సారధి రోహిత్ శర్మ.. ఓ రికార్డును నమోదు చేశాడు. ఆసియా వన్డే ఫార్మాట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును అందుకున్నాడు. టీమ్‌ఇండియా తరఫున సచిన్ పేరు మీదున్న అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ ఆసియా కప్ కెరీర్‌లో(వన్డేలు) మొత్తం 9 అర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజాగా పాకిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదడం ద్వారా.. రోహిత్(9) సచిన్ సరసన చేరాడు. ఈ అర్ధ శతకంతో రోహిత్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్డేల్లో 80 సార్లు 50కి పైగా స్కోర్లు చేసిన 13వ ప్లేయల్‌గా నిలిచాడు. ఈ విషయంలో సచిన్ టాప్‌లో ఉన్నాడు. 145 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. ఆ తర్వాత కోహ్లీ(111), ద్రవిడ్ (95), గంగూలీ (94), ధోని (83) రోహిత్‌కు ముందున్నారు. ఇకపోతో ఈ మ్యాచ్‌లో 56 పరుగులు చేసి ఔట్ అయ్యారు రోహిత్. మరో 22 పరుగులు చేసుంటే, వన్డేల్లో 10, 000 పరుగుల మైలురాయిని అందుకునేవాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ 247 వన్డేల్లో 48.91 సగటు, 90.19 స్ట్రైక్ రేట్‌తో 9978 రన్స్ సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News