Wednesday, January 22, 2025

అసియా కప్ 2023: నేపాల్ పై బౌలింగ్ ఎంచుకున్న భారత్..

- Advertisement -
- Advertisement -

అసియా కప్ 2023లో భాగంగా భారత్ ఈరోజు(సోమవారం) నేపాల్ జట్టుతో తలపడనుంది. పల్లెకలె స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని జట్టులోకి తీసుకున్నారు.

కాగా, పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేపట్టినా, ఒక్క బంతి కూడా బౌలింగ్ వేయకుండానే వర్షం కారణంగా మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఈ రోజు నేపాల్ తో జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైన నేపాల్ జట్టు.. ఇండియా చేతిలో ఓడిపోయినా, వర్షం పడి మ్యాచ్ రద్దైనా ఇంటిముఖం పట్టాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News