Thursday, January 23, 2025

హాకీ ఆసియా కప్ 2023: టీమిండియా సంచలన విజయం

- Advertisement -
- Advertisement -

టీమిండియా సంచలన విజయం
తొలిసారి జూనియర్ హాకీ ఆసియా కప్ గెలుచుకున్న భారత అమ్మాయిలు
చిలీ : జూనియర్ హాకీ ఆసియా కప్ ఫైనల్లో భారత అమ్మాయిలు సంచలనం సృష్టించారు. వరుసగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన డి పెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాపై విజ యం సాధించింది తొలిసారి ఆసియా కప్ గెలుచుకున్నారు. జపాన్‌లోని కకామిగాహరా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత జూనియర్ విమెన్స్ హాకీ టీమ్ సౌత్‌కొరియా టీమ్‌పై 21తో విజయం సాధించింది. భారత్ తరఫున అన్నూ, నీలం ఒక్కో గోల్ చేయగా, కొరియా తరఫున పార్క్ సియోన్ ఒక్కసారిగా నెట్‌ను ఛేదించారు.

ఇంతకుముందు భారత జూనియర్ విమెన్స్ టీమ్ ఒకసారి రన్నరప్‌గా నిలిచిన సంగతి విధితమే అయితే ఎఫ్‌ఐహెచ్ మహిళల జూనియర్ ప్రపంచ కప్ 2023లో టోర్నమెంట్‌లో జట్టు అజేయంగా నిలిచినందుకు గుర్తింపుగా, హాకీ ఇండియా ప్రతి క్రీడాకారిణికి రూ. 2 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. సహాయక సిబ్బందికి ప్రశంసాపత్రంగా ఒక్కొక్కరికి రూ.1 లక్ష అందజేయనున్నారు. విజేతగా నిలిచిన భారత జట్టు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News