Sunday, December 22, 2024

టీమిండియాకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించిన నేపాల్..

- Advertisement -
- Advertisement -

అసియా కప్ 2023లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో నేపాల్ జట్టు 230 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో నేపాల్, టీమిండింయాకు 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కుశాల్ బర్టెల్(38), ఆసిఫ్ షేక్(58)లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 65 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు విఫలమైనా.. చివర్లో సోమ్ పాల్ కమి(48) రాణించడంతో నేపాల్ జట్టు స్కోరు 200 మార్క్ దాటింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, సిరాజ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. షమీ, శార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News