Wednesday, January 22, 2025

ఆసియాకప్ సూపర్-4: బంగ్లాపై పాకిస్థాన్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

లాహోర్: ఆసియాకప్ సూపర్4లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (53), వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీమ్ (64) మాత్రమే రాణించారు. మిగతా వారిలో నయీం (20), లిటన్ దాస్ (16), షమీమ్ (16), ఆఫిఫ్ (12) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

నసీం షా 3 వికెట్లు తీసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 39.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఫకర్ జమాన్ (20), ఇమామ్ ఉల్ హక్ (78) జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన ఇమామ్ 84 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ రిజ్వాన్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పాకిస్థాన్‌అలవోక విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News