Tuesday, November 5, 2024

ఆసియాకప్‌ 2023: నేపాల్‌పై పాకిస్థాన్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

ముల్తాన్: ఆసియాకప్‌లో పాకిస్థాన్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్‌ఎ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 238 పరుగుల భారీ తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, ఇఫ్తికార్ అహ్మద్‌లు సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ 131 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన ఇఫ్తికార్ అహ్మర్ 71 బంతుల్లోనే 11 బౌండరీలు, 4 భారీ సిక్సర్లతో అజేయంగా 109 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో బాబర్‌తో కలిసి ఐదో వికెట్‌కు 214 పరుగులు జోడించారు. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 23.4 ఓవర్లలోనే కేవలం 104 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు, షాహిన్, హారిస్ రవూఫ్ రెండేసి వికెట్లు తీశారు. నేపాల్ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News