Saturday, December 21, 2024

మెగా టోర్నీకి సర్వం సిద్ధం..

- Advertisement -
- Advertisement -

క్రీడా విభాగం: ప్రతిష్టాత్మకమైన ఆసియాకప్ వన్డే టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఆరు జట్లు తలపడుతున్న ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియాకప్ టోర్నీ జరుగనుంది. ఇందులో మొత్తం పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో భారత్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ జట్లకు చోటు కల్పించారు. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్‌నేపాల్ జట్ల మధ్య జరిగే పోరుతో ఆసియాకప్‌కు తెరలేవనుంది. ముల్తాన్, పల్లెకెలె, లాహోర్, కొలంబో నగరాల్లో ఆసియాకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

పాకిస్థాన్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరుతాయి. ఒక మ్యాచ్ ముల్తాన్‌లో జరుగుతుండగా మిగిలిన మూడు మ్యాచ్‌లకు లాహోర్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. పల్లెకెలెలో మూడు మ్యాచ్‌లు జరుగుతుండగా మిగిలిన మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరుగుతాయి. ఫైనల్ సమరం సెప్టెంబర్ 17న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుంచి లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్4కు అర్హత సాధిస్తాయి. సూపర్4లో మొదటి రెండు స్థానాలు సాధించే జట్లు ఫైనల్లో ప్రవేశిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News