Sunday, January 19, 2025

చెలరేగిన లంక స్పిన్నర్.. గిల్, రోహిత్, కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

కొలంబొ: ఆసియా కప్ సూపర్-4లో భాగంగా కొలంబొ వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్నమ్యాచ్ లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు మరోసారి శుభారంభాన్ని అందించారు. గిల్ జాగ్రత్తగా ఆడినా, రోహిత్ మాత్రం బౌండరీలతో చెలరేగి ఆడుతున్నాడు. దీంతో స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది.

ఈ క్రమంలో బంతి అందుకున్న లంక స్పిన్నర్ వెల్లలాగే టీమిండియాకు షాకిచ్చాడు. వరుస ఓవర్లలో గిల్(19), విరాట్ కోహ్లీ(03), రోహిత్ శర్మ(53)లను ఔట్ చేసి భారత్ జోరుకు బ్రేక్ వేశాడు. దీంతో భారత్ 17 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(03), కెఎల్ రాహుల్(03)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News