Thursday, December 26, 2024

శాంసన్‌పై చిన్నచూపు తగదు..

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెటర్ సంజు శాంసన్‌పై సెలెక్టర్లు చిన్నచూపు చూడడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియాలో శాంసన్‌కు చోటు కల్పించక పోవడం విడ్డూరంగా ఉందని వారు పేర్కొంటున్నారు. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో పోల్చితే శాంసన్ ఎంతో ప్రతిభావంతుడని, అయినా అతనికి టీమిండియాలో శాశ్వత స్థానం దక్కక పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సెలెక్టర్లు కావాలనే శాంసన్‌పై చిన్నచూపు చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. శాంసన్ లభించిన కొద్దిపాటి అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాడని, అయినా అతనికి పలు సిరీస్‌లలో టీమిండియాలో చోటు దక్కక పోవడం బాధించే అంశమని అభిమానులు వాపోతున్నారు.

Asia Cup: Fans fires on BCCI not select Sanju Samson

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News