దుబాయి: ఆసియాకప్ సూపర్4లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అజేయ శతకంతో కదం తొక్కాడు. దీంతో టీమిండియా రికార్డు స్కోరును సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లి 61 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో అజేయంగా 122 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా దిగడం విశేషం. ఇక కెఎల్ రాహుల్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఇక కోహ్లి శతకంతో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించడం గమనార్హం. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇబ్రాహీం జర్దాన్ 64 (నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
Asia Cup: IND Win by 101 Runs against AFG