Tuesday, November 5, 2024

ఆసియాకప్‌: భారత్‌ పసికూన హాంకాంగ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

Asia Cup: India to battle against Hong Kong

సమరోత్సాహంతో భారత్

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా బుధవారం హాంకాంగ్‌తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. పసికూన హాంకాంగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఏమేరకు పోటీ ఇస్తుందో చెప్పలేం. బలమైన పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్‌లో కూడా గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్ బౌలింగ విభాగాల్లో భారత్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్, సీనియర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

తొలి మ్యాచ్‌లో విఫలమైన సూర్యకుమార్, రాహుల్, రోహిత్‌లు ఈసారి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. వీరు తమవంతు పాత్ర పోషిస్తూ హాంకాంగ్‌పై రికార్డు స్కోరును సాధించడం టీమిండియాకు కష్టం కాదు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే దినేశ్‌కు మరో ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక భువనేశ్వర్, హార్దిక్, చాహల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ తదితరులతో టీమిండియా బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

పరీక్షలాంటిదే

మరోవైపు బలమైన టీమిండియాతో పోరు హాంకాంగ్‌కు అతి పెద్ద పరీక్షలాంటిదేనని చెప్పక తప్పదు. క్వాలిఫయింగ్ పోటీల్లో అదరగొట్టిన హాంకాంగ్ ఆసియాకప్‌కు అర్హత సాధించింది. అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా పేరున్న టీమిండియాను ఎదుర్కొవడం హాంకాంగ్‌కు అనుకున్నంత సులువేమీ కాదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న రోహిత్ సేనకు హాంకాంగ్ కనీస పోటీ కూడా ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఒక్క ఓవర్‌లోనే మ్యాచ్ పరిస్థితి మారిపోయే టి20 పోటీల్లో ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఏ మాత్రం నిర్లక్షంగా ఆడిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ పరిస్థితుల్లో హాంకాంగ్‌తో మ్యాచ్‌ను టీమిండియా తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. కానీ ఈ పోరులో టీమిండియాను అడ్డుకోవడం మాత్రం పసికూన హాంకాంగ్‌కు శక్తికి మించిన పనిగానే చెప్పక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News