Monday, December 23, 2024

ఆసియా కప్: ఉత్కంఠ పోరులో పాక్ పై లంక ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

కొలంబో: ఆసియాకప్‌ సూపర్4 మ్యాచ్‌లో భాగంగా గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ జట్టుపై శ్రీలంక ఘన విజయం సాధించింది. చివరి బంతికి రెండు పరుగులు చేసి గెలుపొందిన లంక జట్టు ఫైనల్ కు చేరుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్థాన్.. వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించగా ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంక, చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక బ్యాట్స్ మెన్లలో కుశాల్ మెండిస్ 91 పరుగులు, అసలంక 49 పరుగులు(నాటౌట్), సమరవిక్రమ 48 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు. పాక్ పై విజయంతో లంక జట్టు, ఈ నెల 17న జరగనున్న ఫైనల్ లో టీమిండియాతో తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News