ముంబై: యుఎఇ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్‌లో పాల్గొనే టీమిండియాకు భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడడంతో బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్‌లో భారత జట్టుకు లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో కూడా లక్ష్మణ్ టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్‌లోనూ లక్ష్మణ్‌కు మరోసారి టీమిండియాకు కోచ్‌గా ఉండే అవకాశం దొరికింది. ద్రవిడ్ ప్రస్తుతం స్వదేశంలోనే ఉన్నాడు. కరోనా నెగెటివ్ వస్తేనే అతను యుఎఇకి బయలుదేరి వెళ్లే అవకాశాలుంటాయి. అప్పటి వరకు కోచ్ బాధ్యతలను లక్ష్మణ్ నిర్వర్తిస్తాడు. కాగా, లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. కొంత కాలంగా వివిధ సిరీస్‌లలో లక్ష్మణ్‌ను టీమిండియా కోచ్‌గా ఎంపిక చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 27 నుంచి ఆసియాకప్‌కు తెరలేవనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ టోర్నీకే ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Asia Cup: VVS Laxman Appointed as Head Coach of India