Monday, December 23, 2024

రూ.403 కోట్లతో కోహెడ పండ్ల మార్కెట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ఆసియాలోనే అత్యంత అధునాతనంగా కోహెడ పంట్ల మార్కెట్‌ను నిర్మించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన ,మార్కెటింగ్‌శాఖల మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. 199 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఈ మార్కెట్ కోసం రూ.403కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపారు. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులు , ఉద్యాన ,మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ 11.76 ఎకరాలలో పండ్ల ఎగుమతులకై ఎక్స్ పోర్టు జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 56.54 ఎకరాల్లో రహదారులు, 11.92 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.రైతులకు , వ్యాపారులకు ,ట్రేడర్లకు సకల వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. కమీషన్ ఏజెంట్లందరికీ షాపులు కేటాయిస్తామని తెలిపారు.

మార్కెట్ నిర్మాణ ప్రణాళిక ముఖ్యమంత్రి వద్దకు తీసుకుపోయి సిఎం ఆమోదం తీసుకుని ప్రారంభిస్తాంమని వెల్లడించారు. ఆధికారులు రూపొందించిన కొహెడ మార్కెట్ నిర్మాణ ప్రణాళికను చూసి మంత్రితోపాటు ఎమ్మెల్యేలు సంతృప్తిని వ్యక్తం చేశారు. కోహెడ పండ్లమార్కెట్ నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డితోపాటు హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ, కౌసర్ మొహియుద్దీన్, అహ్మద్ బిన్ అబ్దుల్ల బలాలా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఆర్డీడీఎం పద్మహర్ష, డీఎంఓ ఛాయాదేవి, మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News