- Advertisement -
మరో సెమీఫైనల్లో పటిష్టమైన పాకిస్థాన్‌కు అఫ్గానిస్థాన్ కంగుతినిపించింది. రెండో సెమీఫైనల్లో అఫ్గాన్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను తీస్తూ పాక్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఓపెనర్ ఉమేర్ యూసుఫ్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అఫ్గాన్ బౌలర్లలో ఫరీద్ మూడు, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 17.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నూర్ అలీ జర్దాన్ (39), కెప్టెన్ గుల్బదిన్ నైబ్ 26 (నాటౌట్) అఫ్గాన్‌ను గెలిపించారు. శనివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అఫ్గాన్ తలపడనుంది. ఇందులో గెలిచి టీమ్‌కు స్వర్ణం లభిస్తోంది.
- Advertisement -