Thursday, December 26, 2024

ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత్.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీ స్పందిస్తూ.. “క్రీడాకారుల ప్రతి ప్రదర్శన దేశ ప్రజలు గర్వపడేలా చేసింది. ఈ నెల 10న క్రీడాకారుల బృందానికి ఆతిథ్యం ఇచ్చేందుకు, వారితో సంబాషించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని పేర్కొన్నారు.

కాగా, ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 100 పతకాలు సాధించింది. ఇందులో భారత్ కు 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు లభించాయి. ఆసియా క్రీడల్లో పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News