Sunday, December 22, 2024

మార్చిలో ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ

- Advertisement -
- Advertisement -

Asian Women's Youth Handball Championship will be held in Kazakhstan

మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియా మహిళల యూత్ హ్యాండ్‌బాల్ పోటీలు మార్చి 18 నుంచి కజకిస్థాన్‌లో జరుగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌తో సహా పలు దేశాలకు చెందిన మహిళా జట్లు పోటీ పడనున్నాయయని జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్‌మోహన్ వెల్లడించారు. ఇక లక్నో వేదికగా రెండు రోజుల పాటు సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 27 మంది క్రీడాకారిణిలను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఇక ఎంపికైన ప్లేయర్స్‌కు శిక్షణ శిబిరం నిర్వహిస్తామన్నారు. ఇక దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణిలు ట్రయల్స్‌లో పాల్గొన్నారన్నారు. మరోవైపు తెలంగాణ నుంచి కరీనా భారత జట్టులో స్థానం దక్కించుకుందన్నారు. కాగా, శిక్షణ శిబిరానికి ప్రధాన కోచ్‌గా సాయ్‌కు చెందిన మోహిందర్ లాల్ వ్యవహరిస్తారని జగన్‌మోహన్ రావు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News