ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపుజీ పేరు పెడతామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పద్మశాలీల బతుకమ్మ చీరల బిల్లులు కూడా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, తాము వచ్చాక పెండింగ్ బకాయిలను క్లియర్ చేశామని తెలిపారు. పద్మశాలీల కోసం బీఆర్‌ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. పద్మశాలీ బిడ్డ రాపోల్ భాస్కర్‌ను రాజ్యసభకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌దని గుర్తు చేశారు.
ఏం అవకాశం వచ్చినా పద్మశాలీలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు మహిళలు కట్టుకోలేదని, అవి పొలాల దగ్గర పనికొచ్చాయని విమర్శించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపేశామని క్లారిటీ ఇచ్చారు. అయితే నేతన్నలకు ప్రభుత్వ ఆర్డర్లను రద్దు చేసిన అప్రతిష్ట ఉండవద్దని భావించామని, అందుకే మహిళ సంఘాల్లోని వారికి రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని, ఆ చీరల తయారీ కాంట్రాక్ట్‌ను పద్మశాలీలకు అప్పగిస్తామని తెలిపారు.