Monday, December 23, 2024

రెండో భార్య ఉరేసుకుంటుంటే… వీడియో తీసి పైశాచిక ఆనందం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండో భార్య ఉరేసుకుంటుంటే భర్త వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందిన సంఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో జరిగింది. భార్య మృతి చెందాక బావమరదులకు ఫోన్ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరం… సయ్యద్ అలీగూడలో షేక్ రసూల్ (39) అనే వ్యక్తి కార్పెంటర్ పని చేస్తూ ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలను పోషిస్తున్నాడు. మొదటి భార్యకు నలుగురు పిల్లలు, రెండో భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అర్షాబేగం(22) ప్రేమపెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య షేక్ రసూల్ మద్యానికి బానిస కావడంతో రెండో భార్యను వేధించసాగాడు.

రోజు రోజుకు మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె బరించలేకపోతుంది. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడంతో భర్తతో అర్షాబేగం గొడవ పెట్టుకుంది. మద్యం మానేయకుంటే చస్తానని ఆమె బెదిరించడంతో చస్తే చావు అని అన్నాడు. వెంటనే ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుంటుండగా వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు. భార్య చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత బావమరదులు ఫోన్ చేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News