Monday, January 20, 2025

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఆరా..!

- Advertisement -
- Advertisement -
  • కోహెడలో పర్యటించిన అదనపు కలెక్టర్
  • అధికారులతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

కోహెడ: సిద్దిపేట జిల్లా అద నపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కోహెడ మండలంలో శనివారం పర్యటించారు. జూనియర్ పం చాయతీ కార్యదర్శులను (జెపిఎస్) క్రమబద్దీకరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతు న్న నేపథ్యంలో..ఇప్పటి వరకు ప్రొబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న జెపిఎస్‌నల సర్వీ స్, వారి విధి నిర్వహణ విచారణ చేసి నివేదించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కోహెడ మండలంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శు లు పనిచేస్తున్న పలు గ్రామాలను సందర్శించా రు. ఇందులో ధర్మసాగర్‌పల్లి, కోహెడ, తీగలకుంటపల్లి, వింజపల్లి, ఎర్రకుంటపల్ల గ్రామాలను జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ సందర్శించి.. జూనియర్ పంచాయతీ కా ర్యదర్శుల పనితీరుపై ఆరా తీశారు. ఆయా గ్రామపంచాయతీలను పరిశీలించి వివరాలు సేకరించారు.

నాలుగేండ్లు పూర్తి చేసిన వారు ఎంతమంది ఉన్నా రు..? గ్రామాల్లో రోడ్ల పరిశుభ్రత, మొక్కల పెంపకం, నర్సరీల నిర్వహణ, చెత్త సేకరణ, కాంపోస్ట్ ఎరువల తయారీ, పల్లె ప్రకృతీ వనం, పాఠశాల్లో టాయిలెట్స్, ట్రాక్టర్ ఇఎం ఐ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, ఇం టిపన్ను వసూళ్లు, హరిత హారంలో ఎన్ని మొ క్కలు నా టారు..? ఎన్ని సంరక్షించారు..? జన న, మరణాల నమోదు ధృవప్రత్రాల జారీ ప్ర క్రియ, పల్లెప్రగతిలో చేపట్టిన అన్ని అంశాల్లో ప్రగతిని దృష్టిలో ఉంచుకొని వారు ఏ మేరకు పనిచేశారు? వారు పనిచేసిన పల్లెలు ఎంత మే ర ప్రగతి సాధించాయో అదనపు కలెక్టర్ గరీ మ అగర్వాల్ వివరాలు నమోదు చేసుకున్నా రు. తొమ్మిదో విడత హరితహారంలో ఆయా గ్రామపంచాయతీలు నిర్ధేశించిన లక్షాన్ని 30 వరకూ పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. జడ్పి సిఇఓ రమేష్, డిపిఓ దేవకి దేవి, డిఈ సదాశివ, డిఎల్పిఓలు, ఎంపిడిఓ మధుసూదన్, ఎంపిఓ సురేష్, ఏఈ మజీద్,ఆయా శాఖల అధికారులున్నారు.

అధికారులతో సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్

అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ మండల అధికారులతో సమీక్ష సమాశం నిర్వహించారు. 9వ విడత హరితహారం, స్వచ్చ సర్వేక్షాన్ గ్రామీణ్ 2023 సర్వే, నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సమీక్షించారు.

అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్‌కు స్వాగతం పలికిన ఎంపిపి కీర్తిసురేష్

అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ బాధ్యలు తీసుకున్న తర్వాత తొలిసారిగా కోహెడ మండలానికి రావడంతో కోహెడ ఎంపిపి కొక్కుల కీర్తిసురేష్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికి, శాలువతో సన్మానించారు. స్వాగతం పలికిన వారిలో… జడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్‌రావు, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు జాగిరి కుమారస్వామి గౌడ్, నాయకులు కొక్కుల సురేష్, ఆవుల మహేందర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News