Monday, December 23, 2024

ఆరోజు కేంద్రంలో నాలుగు మంత్రి పదవులు అడిగా.. బీజేపీ ఇవ్వలేదు: నితీశ్

- Advertisement -
- Advertisement -

Asking for 4 central cabinet berths in 2019: Nitish Kumar

పాట్నా : 2019లో కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీకి నాలుగు బెర్తులు కేటాయించాలన్న తమ డిమాండ్‌ను బీజేపీ పట్టించుకోలేదని, బీహార్ సిఎం నితీశ్ కుమార్ తెలిపారు. అందుకే తాము కేబినెట్‌లో చేరకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. మాకు 16 మంది ఎంపీలు ఉన్నారు. అందుకే కేబినెట్‌లో కనీసం నాలుగు మంత్రి పదవులైనా కావాలని అడిగినా బీజేపి ఇవ్వలేదని తెలిపారు. అదే బీహార్ లోని ఐదుగురు బీజేపీ ఎంపీలను మంత్రులుగా తీసుకున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో చెడు సంకేతాలు ఇచ్చినట్టయింది. అందుకే కేబినెట్‌లో చేరరాదని నిర్ణయించుకున్నాం అని వివరించారు. గత ఏడాది తన మాజీ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్‌ను తనకు చెప్పకుండానే కేబినెట్‌లో చేర్చుకున్నారని , అందుకే ఆర్నెలలకే రాజీనామా చేయించినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News