Wednesday, January 22, 2025

మరో హీరోయిన్ పెళ్లి చేసేసుకుంది!

- Advertisement -
- Advertisement -

మరో బాలీవుడ్ బ్యూటీ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంది. ఆ ముద్దుగుమ్మ పేరు అస్మితా సూద్. ఎవరీ అస్మిత అనుకుంటున్నారా? తెలుగులో ‘బమ్మిగాడి కథ’తో హీరోయిన్ గా పరిచయమైంది. ఆడు మగడ్రా బుజ్జీ, ఆ ఐదుగురు అనే మూవీల్లోనూ నటించింది. హిందీలో ‘బత్తమీజ్ దిల్’ మూవీలోనూ హీరోయిన్ గా నటించింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అస్మిత సినిమాల్లోకి ప్రవేశించినా, పెద్దగా ఆఫర్లు రాలేదు. కొన్ని తెలుగు, కన్నడ, తమిళ మూవీల్లో నటించింది. కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త సిద్ మెహతాతో ప్రేమలో పడింది. ఏడాదిన్నరగా ఇద్దరి మధ్యా ప్రేమాయణం నడుస్తోంది. ఇటీవల ఈ జంట ప్రేగ్ వెళ్లినప్పుడు అక్కడ సిద్ మెహతా ఓ ఖరీదైన ఉంగరాన్ని బహూకరించి, తన ప్రేమను వ్యక్తం చేశాడట. అంతే, అస్మిత కాదనకుండా ఒప్పేసుకుంది. నాలుగు రోజుల క్రితం గోవాలో సిద్-అస్మితల వివాహం జరిగింది. ఎవరికీ చెప్పకుండా స్నేహితులు, బంధువుల సమక్షంలో చేసుకున్న ఈ పెళ్లి తాలూకు ఫోటోలను తాజాగా విడుదల చేశారు.

Asmita Sood marriage with Siddh Mehta

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News