Monday, December 23, 2024

పోటెత్తిన ఆశావహులు

- Advertisement -
- Advertisement -

బిజెపి టికెట్ కోసం చివరిరోజు 2,781మంది దరఖాస్తు
119 నియోజకవర్గాలకు 6,003 అప్లికేషన్లు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు భారతీయ జనతా పార్టీ టికెట్ల కోసం భారీగా ద రఖాస్తు చేసుకున్నారు. ఈనెల 4వ తేదీన ప్రా రంభమైన దరఖాస్తు ప్రక్రియ ఆదివారం ముగిసింది. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేకపోవడం తో పార్టీ టిక్కెట్ల కోసం భారీగా దరఖాస్తులు అం దాయి. చివరి రోజు 2781 ఆశావహుల దరఖా స్తు అందజేశారు. వారిలో ముఖ్యనేతల తరుపున వారి అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెం దిన నేతల సైతం తమ దరఖాస్తులను అందజే సి.. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశా రు. భారీగా తరలివచ్చిన ఆశావహులు, వారి అ నుచరులతో బిజెపి కార్యాలయం సందడిగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. కాంగ్రెస్ పా ర్టీలు ఎన్నికల ప్రక్రియలో వేగం పెంచింది. ఇదే క్రమంలో బిజెపి ఎన్నికలకు తన శ్రేణులను స న్నద్ధం చేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బి జెపి భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. ఇప్పటికే సునీల్ బన్సల్ నేతృత్వంలో ప్రత్యేక కార్యచరణ చేపట్టిం ది. వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటికే దరఖాస్తు లు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేలు రఘునందన్‌రా వు, ఈటల రాజేందర్ తరఫున వారి అనుచరుల దరఖాస్తు చేయగా.. ఈటల సతీమణి జమున సైతం ఎమ్మెల్యే టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పొంగులేటి ముఖ్య అనుచరుల్లో ఒకరైన దొడ్డ నగేష్ యాదవ్ బిజెపి అభ్యర్థిగా ఖమ్మం బరిలో ఉండేందుకు తన అనుచరున్ని పంపి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్యేగా తాను దరఖాస్తు చేసుకోలేదని నిజామాబాద్ ఎంపి ధర్మపు రి అర్వింద్ వెల్లడించారు.

పార్టీ నిర్ణయం మేరకు తాను పని చేస్తానని అర్వింద్ తెలిపారు. ఆదివారం చివరి రోజు కావడంతో ఒక్క రోజే 2781 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు మొత్తం 6003 దరఖాస్తులు వచ్చాయి. నగరంలోని ఐదు నియోజకవర్గాల నుంచి బరి లో నిలిచేందుకు నటి జీవితారాజశేఖర్ దరఖా స్తు చేసుకున్నారు. శేరిలింగంపల్లి నుంచి యో గానంద్, రాజేంద్ర నగర్ నుంచి మణికొండ ము న్సిపాలిటీ వైస్ చైర్మన్ కె. నరేందర్‌రెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, షాద్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి,సనత్ నగ ర్ నుంచి ఆకుల విజయ, జనగామ నుంచి బేజా ది బీరప్ప, బల్ల శ్రీనివాస్, పాలకుర్తి నుంచి యెడ్ల సతీష్ కుమార్, ముషీరాబాద్ నుంచి బం డారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, గాంధీ నగర్ కార్పొరేటర్ పావని, కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కోసం మీడియా సెల్ కో ఆర్డినేటర్ కెవి రంగాకిరణ్ దరఖాస్తు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News