హైదరాబాద్: ‘‘నేను ముకుళిత హస్తాలతో ప్రధాని మోడీని వేడుకుంటున్నాను. ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు. కనుక దయచేసి అగ్నిపథ్ స్కీమ్ నిర్ణయాన్ని ఆయన వెంటనే ఉపసంహరించాలని వేడుకుంటున్నాను’’ అని ఏఐఏఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ప్రధాని ఓ రాజులా వ్యవహరిస్తున్నందునే నేడు యువత తమ ఆక్రోశాన్ని వెల్లగ్రక్కుతోందన్నారు. తనకు దేశం, సాయుధ బలగాల విషయంలో చింత కలుగుతోందన్నారు. ఆయన అగ్నిపథ్ స్కీమ్ ను గురించి ప్రశ్నిస్తూ ‘‘ మెడికల్ భీమా, గ్రాట్యూయిటీ సంగతేమి?’’ అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఓవైసీ ఇదివరలో ప్రధాని మోడీ చేసిన వాగ్దానం ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మోడీ ఏదైనా అంటారే తప్ప ఆచరణలో అర్ధ మనస్సుతో వ్యవహరిస్తుంటారన్నారు. ఓ ప్రక్క పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్ దాడి చేయడానికి పొంచి ఉంటే మన ప్రధానేమో రక్షణ దళాల విషయంలో ప్రహసనాన్ని సృష్టిస్తున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి విషయాల్లో కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రధాని, ప్రజలను దెబ్బతీశారని అన్నారు.
AIMIM अध्यक्ष @asadowaisi ने कहा, देश के प्रधानमंत्री से हाथ जोड़कर अपील करता हूं, ये फैसला गलत है इसे वापस लीजिए #Agnipath #हल्ला_बोल @anjanaomkashyap pic.twitter.com/TQD1vGY1Qb
— AajTak (@aajtak) June 17, 2022