Monday, January 20, 2025

వీడియో వైరల్: కోర్టులో నేరస్థుడిని కాల్చి చంపారు…

- Advertisement -
- Advertisement -

పాట్నాలోని కోర్టుకు పోలీసులు తీసుకొచ్చిన అండర్ ట్రయల్ ఖైదీని దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటన దానాపూర్‌లో చోటుచేసుకుంది. మృతుడు అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్‌గా గుర్తించారు. ఇద్దరు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానాపూర్ సివిల్ కోర్టు ఆవరణలో అభిషేక్‌ను హాజరుపరిచేందుకు తీసుకువెళుతుండగా దాడి జరిగినట్లు చెబుతున్నారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది.

ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగినట్లు సమాచారం. జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్థుడు అభిషేక్ కుమార్ అలియాస్ ఛోటే సర్కార్‌ను దానాపూర్ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువెళుతున్నారు. అనంతరం దుండగులు అతడిని కాల్చి చంపారు. మృతుడు బిహ్తా నివాసి. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News