Thursday, January 23, 2025

జిహాదీ కార్యకలాపాలకు అడ్డాగా అస్సాం

- Advertisement -
- Advertisement -

Assam becoming hotbed of jihadi activities

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ఆందోళన

గువాహటి: జిహాదీ కార్యకలాపాలకు అస్సాం కేంద్ర స్థానంగా మారుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కాలంలో రాష్ట్ర పోలీసులు జిహాదీ కార్యకలాపాలు సాగిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించారని తెలిపారు. గడచిన ఐదు మాసాలలో ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్‌కు చెదిన ఐదు శిబిరాలపై దర్యాప్తు సంస్థల సహకారంతో అస్సాం పోలీసులు దాడులు నిర్వహించారని ఆయన చెప్పారు. ఆ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న 12 మందిని పోలీసులు గతవారం అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముస్లిం యువకులను ఇమామ్‌లు ప్రైవేట్ మద్రాసాలలో చేర్చుకుని మత బోధకులుగా మారుస్తున్నారని ఆయన తెలిపారు. మద్రాసాలలో బోధకులుగా ఎవరైనా చేరితే వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందచేయాలని ఆయన ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News