Monday, January 20, 2025

వ్యక్తిగత ఫోటోలు వైరల్.. బిజెపి నేత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ బిజెపి మహిళా నాయకురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అస్సాం రాజధాని గౌహతిలోని బామునిమైదాం ప్రాంతంలో గత శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలిని బిజెపి ముఖ్య నాయకురాలు ఇంద్రాణి తహబీల్దార్ గా గుర్తించారు.

ఓ బిజెపి సీనియర్ లీడర్ తో ఇంద్రాణి గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరు సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో మనస్థాపానికి గురైన ఇంద్రాణి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News