- Advertisement -
డిస్‌పూర్: తన భార్యకు చెందిన సంస్థకు కేంద్ర సబ్సిడీ లభించినట్లు నిరూపిస్తే రాజకీయా నుంచి తప్పుకుంటానని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం ప్రకటించారు.
టిఎంసి రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమన్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన భార్యకు సంబంధించిన కుంభకోణంలో ముఖ్యమంత్రి హిమంత తన నిజాయితీని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని టిఎంసి ఎంపి డిమాండ్ చేశారు.
అంతకుముందు, ఉదయం అస్సాం అసెంబ్లీలో హిమంత భార్యకు చెందిన సంస్థకు రూ.10 కోట్ల కేంద్ర సబ్సిడీ లభించినట్లు ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ అంశాన్ని చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానానికి నోటీసు ఇవ్వగా స్పీకర్ దాన్ని తిరస్కరించారు. ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రికి త్యతిరేకంగా నిరసనకు దిగారు.
- Advertisement -