Wednesday, November 20, 2024

అస్సాం సిఎం హిమాంత బిస్వా శర్మ కాంగ్రెస్ ఎంపి రాహుల్‌కు క్షమాపణ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్

మనతెలంగాణ/హైదరాబాద్:  అస్సాం సిఎం హిమాంత బిస్వాశర్మ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. సిఎం బిస్వా శర్మ రాహుల్‌గాంధీకి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిఎం హిమాంత బిస్వా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపి రాహుల్ గాంధీపై సిఎం బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే బిజెపి రాముడి పేరును వాడుకుంటుందని ఆయన మండిపడ్డారు. అయోధ్య రామ మందిరంలో జరిగిన రామ్‌లాల్ ప్రాణ ప్రతిష్ట వేడుకకు భద్రాది ఆలయానికి ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాముడి అందరివాడనీ, కొందరి వాడు కాదనీ ఆయన స్పష్టం చేశారు. ఓట్ల కోసమే బిజెపి దేవుడి పేరుతో రాజకీయం చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. కాగా, అస్సాంలో భారత్ న్యాయ్ యాత్ర చేస్తోన్న రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సిఎం హిమాంత బిస్వా శర్మ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని మీడియా ముందే రావణుడని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News