Saturday, December 28, 2024

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిపై అసోం సిఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా..

- Advertisement -
- Advertisement -

గువహతి : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రింకి శర్మ భూయాన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అసోంలో కొవిడ్ పిపిఇ కిట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని పేర్కొంటూ సిసోడియా తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలకు దిగడంపై రింకి శర్మ స్పందించారు. ఇప్పటి సిఎం హిమంత రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా తీవ్రత దశలో పిపిఇ కిట్ల కుంభకోణం చోటుచేసుకుందని, శర్మ భార్య, కుమారుడి కంపెనీల నుంచి కిట్స్ తెప్పించి, ఇతర కంపెనీల కన్నా ఎక్కువ ధరలక కాంట్రాక్టు ఇచ్చారని ఇటీవల సిసోడియా విలేకరుల సమావేశంలో ఆరోపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకించారు. ఈ ఆరోపణకు వ్యతిరేకంగా రింకి శర్మ స్పందించి కోర్టుకు వెళ్లారు. పరువు నష్టం దావా వేశారు. దీనితో ఈ నెల 25న సిసోడియా కామ్రూప్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని వీలు కాకపోతే తన లాయరు ద్వారా వాదనలు విన్పించుకోవచ్చునని న్యాయస్థానం ఆదేశించింది.

Assam CM Wife files Rs 100 Crore defamation suit against Aap leader

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News