Wednesday, December 25, 2024

కాంగ్రెస్‌కు అసోం నేత రానా గోస్వామి రాజీనామా

- Advertisement -
- Advertisement -

గువహతి : అసోం కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు రానా గోస్వామి పదవికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఆయన బిజెపిలో చేరనున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో చర్చించి పార్టీలో చేరనున్నారని స్పష్టం అయింది. తాను ఆదివారమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు, ఇప్పుడు దీనిని అధికారికంగా ధృవీకరిస్తున్నట్లు రానా విలేకరులకు తెలిపారు. ఇందుకు పలు రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. అసోం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్నానని , కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటున్నానని గోస్వామి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

రాజీనామా తరువాత వెంటనే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. బిజెపి అధ్యక్షులు జెపి నడ్డాను కలిసి, అసోం సిఎం హిమంత బిస్వా సమక్షంలో బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రాజీనామాకు ఆయన ఎటువంటి కారణాలు చూపలేదని అసోం కాంగ్రెస్ నేత దెబబ్రత సైకియా విలేకరులకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల దశలోగోస్వామి రాజీనామా ఈశాన్య కీలక రాష్ట్రం అసోంలో పార్టీ విజయావకాశాలపై ప్రభావం పడుతుంది. ఇక గోస్వామి బిజెపిలో చేరుతున్న విషయం తనకు తెలియదని సిఎం బిస్వా తెలిపారు. అయితే ఆయన పార్టీలోకి వస్తామంటే కాదనం, స్వాగతిస్తామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News