Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

దిస్‌పూర్: అస్సాం రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌహతిలోని జలూక్‌బరీ ప్రాంతంలో కారును ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: పెరిగిన వేడి..గుడ్లు తేలేస్తున్న కోడి

మృతులు గౌహతిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ ఢీకొట్టే డివైడర్‌ను ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. మృతులు ఎమోన్ గయాన్, కౌశిక్ బారుహ్, అరిందమ్ భల్లాల్, రాజ్‌కిరణ్ బుయాన్ , నియోర్ దేకా, ఉపాంగ్సు శర్మ, కౌశిక్ మోహన్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News