Sunday, December 22, 2024

అస్సాంలో వరదలు

- Advertisement -
- Advertisement -

52 మంది మృతి

గువాహతి: అస్సాంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గత 24 గంటలలో 52 మంది మృతి చెందగా, 24 లక్షలకు పైగా నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని 35 జిల్లాల్లో 30 జిల్లాలు వరదలకు ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వేలాది మంది గూడు లేక అల్లాడుతున్నారు.  అస్సాంలో వరదలు రావడం ఇది రెండో సారి.  వరదలకు చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి.

అస్సాంలో అనేక కుటుంబాలు రిలీఫ్ క్యాంపులో జీవిస్తున్నాయి. అనేక గ్రామాల్లో ఇళ్లు నీళ్లలో మునిగిపోయాయి. అస్సాంలోని బర్పేట జిల్లా చాలా దెబ్బతిన్నది. 140000 మంది జనులు ప్రభావితం కాగా, 179 గ్రామాలు వరద నీళ్లలో మునిగిపోయాయి, 1571.5 హెక్టార్ల పంట నష్టం జరిగింది. దుబ్రీ అనే మరో జిల్లా కూడా ఘోరంగా దెబ్బతిన్నది.బ్రహ్మపుత్ర నది నీరు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News