గౌహతి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తున్నారు. రాహుల్ యాత్రకు అడుగడుగున అస్సాం ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. రాహుల్ యాత్ర అస్సాంలోకి ప్రవేశించగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూట్ మ్యాప్ మార్చుకోవాలని సూచించారు. ట్రాఫిక్ కారణాలతో పాటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో రూట్ మ్యాప్ మార్పు చేసుకోవాలని తెలిపారు. గౌహతి నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు రాహుల్ యాత్రకు అడ్డుగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బారీకేడ్లను తొలిగించి ముందుకు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. గతంలో ఇదే మార్గంలో బజ్‌రంగ్ దళ్, బిజెపి చీఫ్ నడ్డాజీ ర్యాలీ చేపట్టారని, అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వచ్చాయని రాహుల్ అడిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను మాత్రమే దాటమని, ఎక్కడ చట్టాన్ని అతిక్రమించలేదన్నారు.
బారికేడ్లను తొలగించటంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది అస్సాం సంస్కృతి కాదని, మాది శాంతియుత రాష్ట్రం అని హిమంత్ తెలిపారు. నక్సలైట్ వ్యూహాలకు తాము వ్యతిరేకమని, గొడవలు జరిగేలా రాహుల్ గాంధీ రెచ్చగొట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశాయని పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేసిన పోస్టులు సాక్ష్యాలుగా తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
సోమవారం రాహుల్ ఓ దేవాలయంలోనికి వెళ్లినప్పుడు స్థానిక అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేఘాలయ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి కూడా అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
असम में 'भारत जोड़ो न्याय यात्रा' को बैरिकेड लगाकर रोक दिया गया है।
'भारत जोड़ो न्याय यात्रा' की बुलंद आवाज से डरी-सहमी असम सरकार ऐसी कायर और शर्मनाक हरकतों से बाज नहीं आ रही।
BJP ये न भूले कि ये जनता की आवाज है, इसे किसी भी कीमत पर कुचला और दबाया नहीं जा सकता।
हमारी राह के… pic.twitter.com/q1E53exwPA
— Congress (@INCIndia) January 23, 2024
अहंकार ध्वस्त हुआ
असम के मुख्यमंत्री और दिल्ली में बैठे उनके मालिक का अहंकार कांग्रेस के बब्बर शेरों ने ध्वस्त कर दिया।
"कोई भी शक्ति इस यात्रा को नहीं रोक सकती" 🦁 pic.twitter.com/u3cDSPWpkA
— Congress (@INCIndia) January 23, 2024