Friday, December 20, 2024

అస్సాంలో భారత్ న్యాయ యాత్రకు అవరోధాలు

- Advertisement -
- Advertisement -

గువాహటి: ఈనెల 14న ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా అస్సాంలోని రెండు జిల్లాలలో తమ నాయకులు ప్రభుత్వ మైదానాలలో రాత్రి వేళల్లో బస చేసేందుకు అస్సాం ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ పార్టీ గురువారం తెలిపింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోసహా ఇతర సీనియర్ నాయకులు రాత్రి బస చేసే కంటెయినర్లను నిలిపేందుకు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ స్థలాల కోసం వెదుకుతున్నట్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. దేమాజీ జిల్లాలోని గోగాముఖ్ వద్ద ఒక స్కూలు గ్రౌండులో రాత్రి కంటెయినర్లు నిలిపేందుకు అనుమతి కోరామని ఆయన చెప్పారు.

మొదట అనుమతి ఇచ్చిన అధికారులు తరువాత అనుమతి ఉపసంహరించుకున్నారని సైకియా చెప్పారు. జోర్హాట్ జిల్లాలో కూడా ఇదే విధంగా జరిగిందని ఆయన చెప్పారు. రాజకీయ కార్యక్రమం కాని యాత్రను నిర్వహించుకునే ప్రజాస్వామిక హక్కును బిజెపి కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నందున ఇతర జిల్లాలలో పరిస్థితి తమకు ఇప్పటివరకు తెలియదని ఆయన చెప్పారు. రాత్రి పూట బస చేసేందుకు తమ పొలాలను, మైదానాలను ఇవ్వవలసిందిగా ప్రైవేట్ వ్యక్తులను కోరుతున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News