Tuesday, January 7, 2025

అసోంలో బీఫ్ వినియోగంపై నిషేధం

- Advertisement -
- Advertisement -

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో గొడ్డు మాంసాన్ని విక్రయించడాన్ని, తినడాన్ని నిషేధిస్తున్నట్టు ముఖ్యమంత్రి హిమంత బుధవారం ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే గొడ్డు మాంసం వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఆ చట్టాన్ని సవరించి కొత్త నిబంధనలను చేర్చాలని రాష్ట్ర మంత్రిత్వశాఖ తాజాసమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం నుంచి ఈ నిషేధం రాష్ట్రమంతా అమలులోకి వస్తుందని ,

తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి హిమంత విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. బీఫ్ వ్యవహారంపై కొద్ది రోజులుగా అసోంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇది రెండు పార్టీల మధ్య వివాదాస్పదమైంది.ఇటీవల అసోంలో జరిగిన ఉప ఎన్నికల్లో సమగురి అసెంబ్లీ నియోజకవర్గం లోని మైనార్టీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి ముఖ్యమంత్రి హిమంత బీఫ్ పార్టీ నిర్వహించారని కాంగ్రెస్ ఎంపీ రబికుల్ హుస్సేన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో హిమంత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News