Sunday, December 22, 2024

కాంగ్రెస్ యాత్రలో పాల్గొనవద్దు

- Advertisement -
- Advertisement -

ప్రజలకు అస్సాం ప్రభుత్వం బెదరింపు
కానీ జనం బిజెపికి భయపడడం లేదు
రాహుల్ గాంధీ వెల్లడి

బిశ్వనాథ్ చరియాలీ (అస్సాం) : అస్సాంలో బిజెపి సారథ్యంలోని ప్రభుత్వం భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనవద్దని ప్రజలను బెడరిస్తోందని, యాత్ర మార్గం పొడుగునా కార్యక్రమాలకు అనుమతిని కూడా ప్రభుత్వం నిరాకరిస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు. అయితే, జనం బిజెపి అంటూ భయపడడం లేదని ఆయన వెల్లడించారు. బిశ్వనాథ్ జిల్లా కేంద్రమైన బిశ్వనాథ్ చరియాలీలో బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలలో బిజెపి కన్నా భారీ ఆధిక్యంతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘మేము యాత్రలో భాగంగా భారీ ప్రసంగాలు చేయం.

మేము రోజూ ఏడెనిమిది గంటల పాటు ప్రయాణిస్తామని, మీ సమస్యలు వింటామని, ఆ సమస్యల ప్రస్తావనే తమ లక్షమని సభలో రాహుల్ చెప్పారు. రాష్ట్రంలో యాత్రలో పాల్గొనవద్దని ప్రజలను బెదరిస్తున్నారని, యాత్ర మార్గాలలో కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ జెండాలు, బ్యానర్లను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. “ప్రజలను అణచివేయగలమని వారు (ప్రభుత్వం) భావిస్తున్నారు. కానీ ఇది రాహుల్ యాత్ర కాదని వారు గ్రహించడం లేదు. ఇది ప్రజల గొంతు వినిపించే యాత్ర’ అని రాహుల్ చెప్పారు.

యాత్ర ఆదివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ నుంచి బిశ్వనాథ్ ద్వారా అస్సాంలోకి తిరిగి ప్రవేశించింది. ‘రాహుల్ గాంధీ గానీ, అస్సాం ప్ర.జలు గానీ మీ గురించి భయపడడం లేదు. మీరు కోరుకున్నది చేయవచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు భారీ ఆధిక్యంతో బిజెపిని కాంగ్రెస్ ఓడిస్తుంది’ అని ఆయన అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై విమర్శలను కూడా రాహుల్ కూడా కొనసాగించారు. ‘ఆయనను ‘దేశంలోనే అత్యంత అవినీతిమయ సిఎం’ అని రాహుల్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News