Sunday, January 26, 2025

అలా చేస్తున్నాడని రెండో ప్రియుడ్ని చంపిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

దిస్‌పూర్: ఓ యువతి ఇద్దరితో ప్రేమాయణం కొనసాగించింది… ఒక ప్రియుడు వేధింపులకు గురి చేయడంతో మరో ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసిన సంఘటన అస్సాంలోని గౌహతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజలి షా(25), వికాశ్ షా(27) అనే యువతి యవకుడు గాఢంగా ప్రేమించుకున్నారు. అంజలి షా విమానాశ్రయంలో పని చేస్తుండడంతో పుణేకు చెందిన సందీప్ కాంబ్లీ పరిచయమయ్యాడు. సందీప్ కాంబ్లీ కార్ల డీలర్ల బిజినెస్ చేస్తున్నాడు. సందీప్ కాంబ్లేతో అంజలి షా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో ప్రియురాలిని కాంబ్లే వేధించడం ప్రారంభించాడు. దీంతో కాంబ్లేను హతం చేయాలని ప్రియురాలు నిర్ణయం తీసుకుంది. ఇదే విషయం వికాశ్ షాకు చెప్పడంతో ఇద్దరు అతడిని చంపేయాలని అనుకున్నారు. కాంబ్లే కోల్‌కతా రమ్మని కబురు పంపాడు. తనకు కోల్‌కతాలో పని లేదని గౌహతికి వస్తున్నానని, ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేశానని అక్కడికి రమ్మని ప్రియురాలుకు కబురు పంపాడు. ప్లాన్ ప్రకారం వికాశ్ షా కూడా అదే హోటల్‌లో రూమ్ బుక్ చేశాడు.

హోటల్ రూమ్‌లో సందీప్‌తో అంజలి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ రూమ్‌లో వికాశ్ చొరబడి అతడిపై దాడి చేశాడు. తలపై బలంగా కొట్టడంతో రెండో ప్రియుడు అక్కడే మృతి చెందాడు. వెంటనే అంజలి తన మొదటి ప్రియుడితో కలిసి పారిపోయింది. రూమ్‌లో రక్తపు మడుగులో సందీప్ కనిపించడంతో పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించి గౌహతి విమానాశ్రయ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గౌహతి విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆలస్యమైతే రాత్రి 9.15 నిమిషాలకు విమానంలో ఇద్దరు కోల్‌కతాకు వెళ్లిపోయేవారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్నందకు పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News